జూనియర్ ఎన్టీఆర్ ది నందమూరి రక్తం.. కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించే ఓపిక లేదు: నందమూరి తారకరత్న
- తారక్ మా తమ్ముడు, మేమంతా ఒకటేనన్న తారకరత్న
- ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు రావాల్సిందేనని వ్యాఖ్య
- వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న తారకరత్న
ఆంధ్రప్రదేశ్ కు తెలుగుదేశం, చంద్రబాబు పాలన అవసరమని సినీ హీరో నందమూరి తారకరత్న అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తమ్ముడు అని, నందమూరి రక్తం ఆయనలో ఉందని చెప్పారు. సినీ కెరీర్ లో బిజీగా ఉన్న తారక్ అవసరమైనప్పుడు రంగంలోకి దిగుతాడని అన్నారు. జూనియర్ ని పక్కన పెడుతున్నారంటూ అసత్య ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందని... దాన్ని నమ్మవద్దని చెప్పారు. నందమూరి, నారా కుటుంబాలు రెండూ ఒకటేనని అన్నారు. ఏపీ బాగు పడలంటే మామ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని చెప్పారు.
చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి స్పందిస్తూ... ఈ విషయంపై మాట్లాడేంత సమయం కానీ, ఓపిక కానీ తనకు లేవని అన్నారు. వాళ్లకు మైకులు ఉన్నాయ కాబట్టి ఏదో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకునే పనిలో మాత్రమే తాము ఉన్నామని తెలిపారు. విమర్శిస్తున్న వారి మాటలకు స్పందించాల్సిన అవసరం కూడా లేదని, స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వారసులుగా తమను ప్రతి ఒక్కరు అభిమానిస్తున్నారని... ఇంతకంటే ఏమి కావాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని... రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను చూడండి.