ఇవీ ఈనాటి రాజకీయాలు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
- ప్రస్తుత రాజకీయాలపై ట్వీట్ చేసిన లక్ష్మీ నారాయణ
- ఇప్పుడు విభజన , ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు ఉన్నాయని కామెంట్
- అభివృద్ధి, హక్కులు కావాలో, విభజన రాజకీయాలు కావాలో ఆలోచించాలని ప్రజలకు సూచన
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, హక్కులు కావాలా? విభజన రాజకీయాలు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. ‘ప్రజలు ఎప్పుడైనా అభివృద్ధిని గురించి అడిగితే వాళ్లమతాల మధ్య చిచ్చు పెట్టండి. ప్రజలు హక్కుల గురించి అడిగితే వాళ్ల మధ్య గొడవలు పెట్టండి. ఇవి ఈనాటి రాజకీయాలు. మనకు అభివృద్ధి కావాలా? హక్కులు కావాలా? లేక విభజన రాజకీయాలు కావాలా ? ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే లక్ష్మీ నారాయణ ఏ పార్టీని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారో తెలియడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.