ఈ స్నాక్స్ తో ఆకలి తీరడంతోపాటు ఆరోగ్యం కూడా!

  • జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి
  • నట్స్, డ్రై ఫ్రూట్స్ మంచి ఎంపిక
  • కార్న్ ఫ్లేక్స్, మొలకెత్తిన గింజలు, పీనట్ బటర్ తీసుకోవచ్చు
ఈవెనింగ్ స్నాక్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. రోజులో మిగిలిన భాగంలో చురుగ్గా, శక్తిమంతంగా ఉంచడంలో స్నాక్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్, తోపుడు బండ్లపై చాట్, బజ్జీ, ఆలూ చిప్స్, బిస్కెట్ల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం ఆరోగ్య పరంగా మంచిది. ఇలాంటి వాటికి బదులు, ఆరోగ్యకరమైన స్నాక్స్ ను పోషక నిపుణులు సూచిస్తున్నారు.

నట్స్, డ్రైఫ్రూట్స్ స్నాక్స్ మంచి ఎంపిక అవుతాయి. వెంటనే ఆకలి వేయకుండా, శక్తినిస్తాయి. కావాలంటే మిల్క్ షేక్ తీసుకోవచ్చు. చాక్లెట్ లేదా పీనట్ బటర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటి ద్వారా ప్రొటీన్, ఫైబర్, మంచి ఫ్యాట్లు శరీరానికి అందుతాయి. దీంతో ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఇవి కాకుండా స్నాక్స్ కింద కార్న్ ఫ్లేక్స్ ను ఓ కప్పు తీసుకోవచ్చు. అలాగే, ఓ కప్పు మొలకెత్తిన గింజలను తినొచ్చు.

చక్కెర జోడించని పీనట్ బటర్ (వేరుశనగతో చేసే) ను కూడా తినొచ్చు. దీన్ని తీసుకుంటే రక్తంలో బ్లడ్ షుగర్ పెద్దగా పెరగదు. మధుమేహం ఉన్న వారికి ఇదొక స్నాక్ ఆప్షన్. ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఒకటి లేదా రెండు స్పూన్ల పీనట్ బటర్ తినొచ్చు. ఇక నట్స్ లో పిస్తాలు విశిష్టమైనవి. మంచి పోషక విలువలు కలిగిన రాస్ బెర్రీస్ ను కూడా తీసుకోవచ్చు. దీని వల్ల మంచి పోషకాలతో పాటు బరువు తగ్గొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. ఈ స్నాక్స్ అన్నింటిలోనూ ఫైబర్ ఉండడం వల్ల తిన్న వెంటనే జీర్ణం కావు. నిదానంగా జీర్ణం అవ్వడం వల్ల మళ్లీ వెంటనే ఆకలి సమస్య తలెత్తదు. 

ఈ హెల్తీ స్నాక్స్ తో ఆకలి తీరడమే కాకుండా ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటి ద్వారా వచ్చిన శక్తి ఆ రోజంతా సరిపోతుంది. రాత్రి డిన్నర్ ను పరిమితం చేసుకోవచ్చు.


More Telugu News