ఏపీలో మండల కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిమాయకాలు
  • ఆన్ లైన్ లో దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
  • రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయితీ రాజ్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని వివరించింది. దరఖాస్తులకు ఈ నెల 20(మంగళవారం) చివరి తేదీగా ప్రకటనలో పేర్కొంది.

ఖాళీల వివరాలు..
జిల్లా వ్యాప్తంగా 22 మండల కోఆర్డినేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్‌(సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మండల పరిషత్ కేంద్రాల్లో పనిచేయాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలు జీతంగా చెల్లిస్తారు.


More Telugu News