ఆవు నుంచి ఎవరైనా పాలు పితకచ్చు.. కానీ మేము ఎద్దు నుంచి పాలు పితికాం: అరవింద్ కేజ్రీవాల్

  • గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు
  • ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించినట్టు ప్రకటన
  • 2027లో గుజరాత్ లో విజయం సాధిస్తామన్న ధీమా
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాధించిన ఫలితాల పట్ల ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కౌన్సిల్ భేటీలో భాగంగా కేజ్రీవాల్ దీనిపై మాట్లాడారు. ‘‘ఏడాదిలోనే పంజాబ్ లో అధికారం కైవసం చేసుకున్నాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నాం. గోవాలో రెండు ఎమ్మెల్యే, గుజరాత్ లో 14 శాతం ఓట్లతో ఐదు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నాం. గుజరాత్ విజయాన్ని ఓ వ్యక్తి ఉదహరిస్తూ.. ఎద్దు నుంచి మేము పాలు పితికినట్టు నాతో చెప్పాడు. అవును, ఆవు నుంచి ఎవరైనా పాలు పితకచ్చు. కానీ మేము ఎద్దు నుంచి పాలు పితికాం’’అని పేర్కొన్నారు. 

2027లో గుజరాత్ లో ఆప్ సర్కారు కొలువు దీరడం ఖాయమన్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఒక పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మరో పార్టీ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.


More Telugu News