మూడు రోజుల్లోనే రూ. 3600 కోట్లతో ‘అవతార్2’ కలెక్షన్ల సునామీ
- ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదలైన చిత్రం
- భారత్ లో నాలుగు వేలకు పైగా థియేటర్లలో విడుదల
- ఇప్పటికే రూ.133 కోట్ల వసూళ్లతో ‘డాక్టర్ స్ట్రేంజ్’ రికార్డు బ్రేక్ చేసిన వైనం
సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘అవతార్ 2’ గత వారం విడుదలైంది. 13 ఏళ్ల కిందట వచ్చిన మొదటి భాగంలో ‘పండోరా’ అందాలను చూపించి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామరూన్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ద వే ఆఫ్ వాటర్’లో నీటి అడుగున అందాలు, భారీ సముద్ర జీవులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుడలైంది. కథ, కథనం విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ వసూళ్లలో ఈ చిత్రం దూసుకెళ్తోంది.
కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ. 3600 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారత్ లోనూ ఈ చిత్రంపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’ మొత్తం కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసి సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత బాక్సాఫీస్ దగ్గర రూ. 131–133 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ సినిమా మొత్తంగా రూ.126 కోట్ల కలెక్షన్స్ తో భారత్ లో అత్యధిక వసూలు చేసిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆ రికార్డును‘అవతార్2’ మూడు రోజుల్లోనే బ్రేక్ చేసి మరికొన్ని రికార్డుల దిశగా ముందుకెళ్తోంది.