హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’

  • వచ్చే ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసం
  • 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..
  • సౌర, చంద్రమానం లెక్కల్లో తేడాల సవరణ వల్లే అధికమాసం
వచ్చే ఏడాది శ్రావణమాసం అధికంగా రానుంది. హిందూ పంచాంగం ప్రకారం 2023లో 13 నెలలు ఉండగా, అందులో శ్రావణ మాసాలు రెండు ఉండనున్నాయి. ఒక ఏడాది ఇలా 13 నెలలు (అధిక మాసం) రావడం 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇంగ్లిష్ కేలెండర్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం ఉంటుంది. 

సౌరమాన, చంద్రమాన పంచాంగాల ప్రకారం రోజుల లెక్కింపులో ఉన్న తేడాల కారణంగానే ఇలా అధికమాసం వస్తుంది. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల 6 గంటలు. అదే చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. ఏడాది లెక్కింపులో ఉండే ఈ తేడాలను అధికమాసం రూపంలో సరిచేస్తుంటారు.


More Telugu News