రూ.40 లక్షల బ్రీఫ్ కేసు తీసుకున్న శ్రీహాన్... ట్రోఫీ అందుకున్న రేవంత్... ఇద్దరూ బిగ్ బాస్ విజేతలే!
- ముగిసిన బిగ్ బాస్ సీజన్-6
- నాగ్ ఆఫర్ ను అంగీకరించిన శ్రీహాన్
- అత్యధిక ప్రైజ్ మనీ అందుకున్న శ్రీహాన్
- రేవంత్ కు రూ.10 లక్షల క్యాష్, ప్లాట్, కారు
బిగ్ బాస్ సీజన్-6కి ఆశ్చర్యకరమైన ముగింపు లభించింది. ఓటింగ్ పరంగా శ్రీహాన్ టాప్ లో నిలిచినా, టైటిల్ మాత్రం రేవంత్ కే దక్కింది. అంతేకాదు, రేవంత్ కు ప్లాట్, కారు కూడా దక్కాయి. ఈ పక్రియలో హైడ్రామా నెలకొంది.
తొలుత రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ కాగా, రేవంత్, శ్రీహాన్ ఇద్దరే హౌస్ లో మిగిలారు. ఈ దశలో హోస్ట్ నాగార్జున గోల్డెన్ సూట్ కేసుతో హౌస్ లో అడుగుపెట్టారు. ఇద్దరిలో ఎవరైనా రూ.20 లక్షలు క్యాష్ తీసుకుని బయటికి వచ్చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకు రేవంత్, శ్రీహాన్ ఇద్దరూ నో చెప్పారు. ఆ తర్వాత ఆఫర్ ను రూ.30 లక్షలకు పెంచారు. ఆఫర్ ను అంగీకరించినవారు రూ.30 లక్షలు తీసుకోవచ్చని, బిగ్ బాస్ విజేతగా నిలిచినవారికి రూ.20 లక్షలే వస్తాయని నాగ్ చెప్పారు.
బయటున్న కంటెస్టెంట్లను సలహా కోరగా, కొందరు తీసుకోవాలని, కొందరు వద్దని చెప్పారు. ఇక నాగ్ ఆఫర్ ను రూ.40 లక్షలకు పెంచగా, తీసుకోవాలంటూ శ్రీహాన్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దాంతో శ్రీహాన్ ఆ రూ.40 లక్షలు తీసుకోవడంతో నాగ్ పని సులువైంది. దాంతో రేవంత్, శ్రీహాన్ లను తీసుకుని నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి తీసుకువచ్చారు. రేవంత్ ను విజేతగా ప్రకటించి ట్రోఫీ అందించారు.
శ్రీహాన్ కు రూ.40 లక్షలు దక్కగా... విన్నర్ గా రేవంత్ కు శ్రీహాన్ తీసుకోగా మిగిలిన రూ.10 లక్షలతో పాటు మోమిన్ పేటలో సువర్ణ సాకేత్ వెంచర్ లో సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ కు చెందిన 605 చదరపు అడుగుల ప్లాట్ (రూ.25 లక్షలు), మారుతి సుజుకి బ్రెజా కారు దక్కాయి.
ఇక చివర్లో నాగ్ అసలు విషయం చెప్పారు. ఓటింగ్ లో రేవంత్ కంటే శ్రీహాన్ స్వల్పంగా టాప్ లో ఉన్నాడని వెల్లడించారు. ఈ విషయం అంచనా వేయలేక శ్రీహాన్ ముందే రూ.40 లక్షలకు ఓకే చెప్పి రేసు నుంచి వైదొలిగాడు. ఒకవేళ శ్రీహాన్ రూ.40 లక్షలు తీసుకోకుండా ఉంటే... అతడికి బిగ్ బాస్ విజేతగా రూ.50 లక్షలు, రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్, కారు దక్కేవి. తొందరపడి నిర్ణయం తీసుకోవడంవల్ల, కేవలం రూ.40 లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక, రన్నరప్ గా నిలవాల్సిన రేవంత్... శ్రీహాన్ నిర్ణయంతో జాక్ పాట్ కొట్టేశాడు. ప్రైజ్ మనీలో రూ.10 లక్షలు, ప్లాట్, కారు దక్కించుకుని మురిసిపోయాడు.