యువత ఉన్నతికి విద్యార్థి దశే పునాది: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
- ఏపీలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పర్యటన
- విశాఖలో ఏయూ పూర్వ విద్యార్థుల ఆరో సమావేశం
- హాజరైన నారాయణమూర్తి
- రాజాంలో జీఎంఆర్ సంస్థల సందర్శన
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం 6వ సమావేశానికి హాజరయ్యారు. విశాఖలో ఈ కార్యక్రమం జరిగింది. అటు, విజయనగరం జిల్లా రాజాంలో జీఎంఆర్ సంస్థలను కూడా నారాయణమూర్తి సందర్శించారు. ఉపాధి శిక్షణ కేంద్రం, ఆసుపత్రి, విద్యాసంస్థలను పరిశీలించారు. జీఎంఆర్ ఐటీ కళాశాల రజతోత్సవాల్లోనూ పాల్గొన్నారు.
ఈ క్రమంలో, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడుతూ, యువత ఉన్నతికి విద్యార్థి దశే పునాది అని వెల్లడించారు. మంచి ఆలోచనలు, పోటీతత్వంతో విద్యార్థులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. శక్తిసామర్థ్యాలు పెంచుకుంటేనే అవకాశాలు అందుకోగలరని సూచించారు. యువత శక్తిసామర్థ్యాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.