మేము కాదు గాడిదలం...బాబును మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి: పవన్ కు అంబటి కౌంటర్

  • అంబటి నియోజకవర్గంలో పవన్ వ్యాఖ్యలు
  • సీఎంను రమ్మను, కూసే గాడిదలను రమ్మను అంటూ సవాల్
  • మేము కాదు గాడిదలం అంటూ అంబటి ట్వీట్
దమ్ముంటే మీ ముఖ్యమంత్రిని రమ్మను... కూసే వైసీపీ గాడిదలను రమ్మను... ఏపీలో నా వారాహిని ఆపండి... అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ మంత్రి అంబటి ఇలాకాలో జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరగడం తెలిసిందే. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర అనంతరం నిర్వహించిన సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై అంబటి రాంబాబు ట్విట్టర్ లో వెంటనే స్పందించారు. మేము కాదు గాడిదలం... బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి పవన్ కల్యాణ్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

అంతకుముందు పవన్ తన ప్రసంగంలో అంబటిని టార్గెట్ చేశారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం తెలియని అంబటి నీటిపారుదల శాఖ మంత్రి అని ఎద్దేవా చేశారు. శవం మీద పేలాలు వేరుకునే మనస్తత్వం మంత్రి అంబటిది అని విమర్శించారు. అంబటి, వైసీపీ నేతల మాటలు... ఉత్తర కుమార ప్రగల్బాలు అని వ్యాఖ్యానించారు. అంబటిలా కమీషన్లు కొట్టేసే దరిద్రగొట్టు మనస్తత్వం తనకు లేదని అన్నారు.


More Telugu News