పవన్ కల్యాణ్ ను రాజకీయ నేతగా చూడట్లేదు: మంత్రి అంబటి
- వీకెండ్ లీడర్ అంటూ జనసేనానిపై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
- ఆయనను చూసి భయపడాల్సిన అవసరం తమకు లేదన్న మంత్రి
- జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నేపథ్యంలో సత్తెనపల్లిలో టెన్షన్
జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టెన్షన్ నెలకొంది. మాచర్ల, తెనాలి ఘటనల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటనపై ఆందోళన నెలకొంది. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గమైన సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ ఆదివారం కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు జనసేన పిలుపునిచ్చింది.
అయితే, పవన్ కల్యాణ్ ను అసలు రాజకీయ నేతగా చూడట్లేదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆయన పర్యటన, యాత్ర కారణంగా భయపడాల్సిన అవసరం తమకులేదని మంత్రి స్పష్టం చేశారు. వేరే ఎవరి కోసమో పనిచేసే వీకెండ్ లీడర్ పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. ఇటీవలి కాలంలో పవన్ పై అంబటి విమర్శల స్పీడ్ పెంచారు. ట్విట్టర్ లోనూ విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.
కాగా, సత్తెనపల్లిలో నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆదుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున మొత్తం 281 కుటుంబాలకు అందజేస్తారని చెప్పాయి. తర్వాత సత్తెనపల్లిలో తలపెట్టిన బహిరంగ సభలో పవన్ మాట్లాడాతారు.