రాహుల్ గాంధీ చైనా, పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారు: జేపీ నడ్డా
- సరిహద్దుల్లో పరిస్థితులపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ
- రాహుల్ మాటలు సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్న నడ్డా
- వీటిని ఎంత ఖండించినా తక్కువేనని వెల్లడి
చైనా ఓవైపు యుద్ధానికి సిద్ధం అవుతుంటే కేంద్రం నిద్రపోతోందా? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
రాహుల్ గాంధీ చైనా, పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ మాటలు భారత సైనికుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఇవి దారుణమైన వ్యాఖ్యలని, వీటిని ఎంత ఖండించినా తక్కువేనని అన్నారు. తెగువ, ధైర్యానికి భారత సైన్యం ప్రతీక అని జేపీ నడ్డా పేర్కొన్నారు. భారత సైన్యం డోక్లామ్ వద్ద ఉంటే, రాహుల్ చైనా దౌత్య కార్యాలయానికి వెళ్లి చైనా అధికారులను కలిశారని ఆరోపించారు.