విజయానికి మరో 4 వికెట్ల దూరంలో టీమిండియా
- ఛట్టోగ్రామ్ లో తొలి టెస్టు
- బంగ్లాదేశ్ టార్గెట్ 513 రన్స్
- లక్ష్యఛేదనలో బంగ్లా విలవిల
- 95 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు
- అక్షర్ పటేల్ కు 3 వికెట్లు
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 238 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి బంగ్లా లైనప్ ను దెబ్బకొట్టాడు. ఉమేశ్ యాదవ్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.
బంగ్లా ఓపెనర్ జకీర్ హుస్సేన్ సరిగ్గా 100 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 67 పరుగులు చేశాడు. బంగ్లా ఓపెనర్లు తొలి వికెట్ కు 124 పరుగులు చేసి శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. యాసిర్ అలీ (5), లిట్టన్ దాస్ (19) విఫలమయ్యారు. ముష్ఫికర్ రహీమ్ 23 పరుగులు చేయగా, నజ్ముల్ హుస్సేన్ 3 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 95 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు కాగా.... కెప్టెన్ షకీబల్ హసన్ 26, మెహిదీ హసన్ 8 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా విజయానికి ఇంకా 4 వికెట్లు అవసరం కాగా, బంగ్లాదేశ్ గెలుపునకు 256 పరుగుల దూరంలో ఉంది.