హెటిరో ల్యాబ్స్ లోకి చొరబడ్డ చిరుత.. వీడియో ఇదిగో!

  • ఖాజీపల్లిలోని కంపెనీలోకి తెల్లవారుజామున చొరబడ్డ చిరుత
  • చిరుతను చూసి భయంతో పరుగులు తీసిన సిబ్బంది
  • హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్
చిరుతలు, పులులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోకి.. కొన్నిసార్లు ఏకంగా ఇంట్లోకే చొరబడుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలోని హెటిరో ల్యాబ్స్ లోకి ఓ చిరుత చొరబడింది. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా చిరుత లోపలికి రావడంతో కంపెనీ సిబ్బంది హడలిపోయారు. వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆపై అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. హెచ్ బ్లాక్ లో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖతో పాటు చిరుతను బంధించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్ కూడా వచ్చింది. కంపెనీలోని మెషిన్లపైన నక్కిన చిరుతను కిందికి దింపి, బంధించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు.. ఎవరూ బయటకు రావద్దని కోరుతున్నారు.


More Telugu News