తొలి టెస్టు మ్యాచ్.. భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న బంగ్లాదేశ్

  • బంగ్లాదేశ్ విజయలక్ష్యం 513 పరుగులు
  • వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసిన బంగ్లా ఓపెనర్లు
  • ఒక్క వికెట్ పడితే పరిస్థితి మారిపోయే అవకాశం
చత్తోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల సహనాన్ని బంగ్లాదేశ్ ఓపెనర్లు పరీక్షిస్తున్నారు. 513 పరుగుల విజయలక్ష్యంతో నిన్న బ్యాటింగ్ ను ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇంత వరకు ఒక్క వికెట్ ను కూడా కోల్పోలేదు. నాలుగో రోజు లంచ్ టైమ్ కు వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది. 

ఇప్పటి వరకు 42 ఓవర్లను ఎదుర్కొన్న నజ్ముల్ హుస్సేన్, జాకీర్ హసన్ లు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిర్మిస్తున్నారు. నజ్మల్ 64 (143 బంతులు), జాకీర్ 55 (109) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కలేదు. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే మరో 394 పరుగులు చేయాలి. అయితే, ఒక్క వికెట్ పడితే పరిస్థితి మొత్తం మారిపోయే పరిస్థితి ఉందనడంలో సందేహం లేదు.


More Telugu News