ఈ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలుస్తుందా అనే ప్రశ్నకు కుల్దీప్ యాదవ్ సమాధానం ఇదే!

  • 300 రన్స్ టార్గెట్ అయితే గెలిచేదేమో అని సమాధానం
  • పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని వ్యాఖ్య
  • స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా అనుకూలిస్తోందన్న కుల్దీప్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దేశం ముందు టీమిండియా 513 పరుగుల టార్గెట్ ఉంచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను కూల్చాడు. మరోవైపు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కుల్దీప్ కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచే అవకాశం ఉందా? అని ఒక జర్నలిస్టు అడిగాడు. దీనికి సమాధానంగా... వ్యక్తిగతంగా తాను అది జరగాలని కోరుకోవడం లేదని చెప్పాడు. 300 పరుగుల టార్గెట్ అయితే జరిగేదేమో అని అన్నాడు. బంగ్లా బ్యాట్స్ మెన్ ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేయడమే తమ లక్ష్యమని చెప్పాడు. 

మరోవైపు పిచ్ పై కుల్దీప్ స్పందిస్తూ... ఇది బ్యాటింగ్ పిచ్ అని తెలిపాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా ఈ పిచ్ సహకరిస్తుందని చెప్పాడు. తాను, అశ్విన్ క్రీజులో ఉన్నప్పుడు తొలుత 360 పరుగులను టార్గెట్ గా పెట్టుకున్నామని... అయితే సమయం గడిచే కొద్దీ పిచ్ మరింత అనుకూలంగా మారిందని, చివరకు స్కోరు 400 దాటిందని అన్నాడు.


More Telugu News