'ఫాల్' వెబ్ సిరీస్ నుంచి మరో రెండు ఎపిసోడ్స్: దివ్యను మేడపై నుంచి తోసేసింది ఎవరు?
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఫాల్' వెబ్ సిరీస్
- క్రితం శుక్రవారం 3 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్
- ఈ ఫ్రైడే మరో రెండు ఎపిసోడ్స్ రిలీజ్
- మరింత ఆసక్తికరంగా మారిన కథనం
- రోహిత్ పై బలపడుతున్న అనుమానాలు
అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'ఫాల్'. దీపక్ ధార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి సిద్ధార్థ్ రామస్వామి దర్శకత్వం వహించాడు. 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు క్రితం వారం మూడు ఎపిసోడ్స్ ను రిలీజ్ చేశారు. మేడపై నుంచి పడిపోయిన దివ్య .. 6 నెలల తరువాత కోమాలో నుంచి బయటికి వస్తుంది. కాకపోతే గతాన్ని మరిచిపోతుంది. దివ్య పర్యవేక్షణలో ఉన్న ఖరీదైన స్థలం కోసం ఆమె అన్నా చెల్లెళ్లే ఆమె బ్రతక కూడదని అనుకుంటారు.
ప్రమాదానికి ముందు వరకూ దివ్య ప్రేమించిన డేనియల్ ఆ స్థలాన్ని కాజేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఇదీ ఆ మూడు ఎపిసోడ్స్ లోని సంక్షిప్త కథ. ఈ వెబ్ సిరీస్ నుంచి నిన్న మరో రెండు ఎపిసోడ్స్ ను రిలీజ్ చేశారు. తాను కోమాలో ఉండగా తనని చంపడానికి తనవారే నిర్ణయించుకున్నారని దివ్య (అంజలి) కి తెలుస్తుంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులందరినీ రోహిత్ (ఎస్పీ చరణ్) ఒప్పించాడని ఆమెకి అర్థమవుతుంది.
అలాగే తన స్థలాన్ని కాజేయడానికి కృతికతో కలిసి డేనియల్ ప్లాన్ చేశాడని కూడా ఆమె తెలుసుకుంటుంది. దివ్య స్పోర్ట్స్ సెంటర్ లో ఉన్న 'ఇలంగో' గురించి పోలీస్ ఆఫీసర్ కుమార్ తో జీవా చెబుతాడు. ఇలంగోను రోహిత్ తరిమేశాడనీ .. అతణ్ణి వెతికి పట్టుకుంటే దివ్యను మేడపై నుంచి ఎవరు తోసేశారనేది తెలుస్తుందని అంటాడు.
దాంతో ఇలంగోను పట్టుకోవడమే కాకుండా .. అతనితో దివ్య రహస్యంగా మాట్లాడే ఏర్పాటు చేస్తాడు పోలీస్ ఆఫీసర్. 'ఇలంగో'తో మాట్లాడిన తరువాత రోహిత్ పై దివ్యకి అనుమానం కలుగుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? దాని పరిణామాలు ఎలాంటివి? అనేది ఈ రెండు ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్స్ కి తగినట్టుగా ఈ రెండు ఎపిసోడ్స్ కూడా ఆసక్తికరంగా కొనసాగాయి.