మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

  • మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో రిసెప్షన్
  • వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
  • ఆశీస్సులు అందజేసిన వైనం
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడు (గోకరాజు రామరాజు తనయుడు) ఆదిత్య వర్మ వివాహ రిసెప్షన్ కు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో ఈ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన సీఎం జగన్ నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.


More Telugu News