భారత్, బంగ్లాదేశ్ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట
- చట్టోగ్రామ్ లో మొదటి టెస్టు
- బంగ్లాదేశ్ ముందు 513 రన్స్ టార్గెట్
- ఆట చివరికి వికెట్ నష్టపోకుండా 42 రన్స్ చేసిన బంగ్లా
- గెలవాలంటే ఇంకా 471 పరుగులు చేయాల్సిన వైనం
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో 25, జకీర్ హుస్సేన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు, తన రెండో ఇన్నింగ్స్ ను 258-2 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా... బంగ్లాదేశ్ కు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 471 పరుగులు చేయాల్సి ఉంది. రేపు ఉదయం సెషన్ లో టీమిండియా బౌలర్లు విజృంభిస్తే బంగ్లాదేశ్ కి కష్టాలు తప్పవు.
ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దాంతో, భారత్ కు 254 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.