అవతార్-2 సినిమా కాదు.... ఒక జీవితకాలపు అనుభూతి: వర్మ
- నేడు అవతార్-2 విడుదల
- కళ్లుచెదిరే విజువల్స్ అంటూ వర్మ ట్వీట్
- యాక్షన్ సీక్వెన్స్ తో మతిపోతుందని వెల్లడి
- ఓ థీమ్ పార్క్ ను సందర్శించినట్టుందని వ్యాఖ్యలు
హాలీవుడ్ దర్శకదిగ్గజం జేమ్స్ కామెరాన్ డైరెక్షన్ లో అవతార్ కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
"ఇప్పుడే అవతార్-2లో స్నానం చేశాను. దీన్ని ఒక సినిమా అనడం నేరం... ఎందుకంటే ఇది అంతకుమించి ఎక్కువ... ఇదొక జీవితకాలపు అనుభూతి. కళ్లు చెదిరే దృశ్యాలు, మతులుపోయే యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే... చాలాసార్లు ఓ థీమ్ పార్క్ లో ఉన్నామా అనేంతగా సమ్మోహనంలో ముంచెత్తింది" అని వివరించారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం 7 గంటల నుంచే అవతార్-2 ప్రదర్శనలు షురూ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ లకు విశేష స్పందన రావడంతో థియేటర్లు కిటకిటలాడాయి. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.