భారత్ లో కళ్లు చెదిరే రైల్వే లైన్ చూశారా..? మనసు పారేసుకున్న నార్వే రాయబారి

  • కర్ణాటకలోని బెంగళూరు -  ఉడుపి రైల్వే మార్గంలో ప్రయాణించాల్సిందే
  • లోయలు, నదులు, సొరంగాల మధ్య ప్రయాణం
  • చూడ్డానికి రెండు కళ్లు చాలవన్నంత సుందరమైన ప్రకృతి అందాలు
మన దేశంలో ఎన్నో అద్భుతమైన, అందమైన ప్రాంతాలు, రోడ్డు, రైల్వే మార్గాలున్నాయి. వీటి గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ. చిక్కటి పచ్చదనం పరుచుకున్న, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి పాములా సాగిపోయే ఓ రైల్వే లైన్ మన దేశంలో ఉంది. అది బెంగళూరు-ఉడిపి రైల్వేలైన్. దీన్ని ఏరియల్ గా చూస్తే కనురెప్పలు కూడా కాసేపు చలనం లేకుండా ఆగిపోతాయి. అంత అద్భుతంగా, అందంగా ఉంటుంది. 

ఈ ఉడిపి రైల్వే లైన్ నార్వే రాయబారి ఎరిక్ సోల్ హీమ్ కు తెగ నచ్చేసింది. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు. ‘‘అద్భుతమైన భారత్. పచ్చదనం మధ్య సాగిపోయే రైల్వే లైన్ ఎక్కడైనా ఉందా? కర్ణాటకలోని బెంగళూరు-ఉడుపి రైల్వై లైన్ లో సక్లేష్ పూర్ నుంచి కుక్కే సుబ్రమణ్య వరకు’’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఈ మార్గంలో సొరంగాలు, లోయలు, నదులు కనిపిస్తాయని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.


More Telugu News