ఈ ఏడాది స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్లు వేటి కోసం వచ్చాయో తెలుసా?

  • టాప్ -3లో చికెన్ బిర్యానీ, మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్
  • సెకన్ కు 137 బిర్యానీ ఆర్డర్ల డెలివరీ
  • స్నాక్స్ లో సమోసా.. స్వీట్స్ లో గులాబ్ జామూన్
స్విగ్గీ ఆర్డర్లలో మళ్లీ బిర్యానీయే నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఏటా ఎక్కువ ఆర్డర్లు ఏ డిషెస్ కోసం వచ్చాయన్న వివరాలను స్విగ్గీ విడుదల చేస్తుంటుంది. 2022 సంవత్సరంలో ఎక్కువ మంది బిర్యానీ కోసం ఆర్డర్లు ఇచ్చారు. బిర్యానీ మొదటి స్థానంలో ఉండడం వరుసగా ఇది ఏడో సంవత్సరం. ప్రతి సెకన్ కు 137 బిర్యానీ ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది.

చికెన్ బిర్యానీ, మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరీ చికెన్ కోసం ఎక్కువ మంది ఆర్డర్ ఇచ్చారు. భారతీయ ఫుడ్ ప్రేమికులు కొత్త రుచుల విషయంలో ప్రయోగం చేసే ధోరణిని ప్రదర్శించారని స్విగ్గీ తెలిపింది. ఎందుకంటే ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైసీ రామెన్, సుషీ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. 

స్నాక్స్ లో సమోసా నంబర్ 1 స్థానంలో ఉంది. ఎక్కువ మంది సమోసా కోసం ఆర్డర్ ఇస్తున్నారు. ఈ ఏడాది 40 లక్షల సమోసాలకు స్విగ్గీపై ఆర్డర్లు వచ్చాయి. దీని తర్వాత అత్యధిక ఆర్డర్లు పాప్ కార్న్, పావ్ బాజి, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్, హాట్ వింగ్స్, టాకో, క్లాసిక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, మింగిల్స్ బకెట్ ఉన్నాయి. 

గులాబ్ జామూన్ కోసం 27 లక్షల ఆర్డర్లు వచ్చాయి. రసమలై కోసం 16 లక్షల ఆర్డర్లను స్విగ్గీ అందుకుంది. చాకోలావా కేక్ కోసం 10 లక్షల ఆర్డర్లు, రసగుల్లా, చాకోచిప్స్ ఐస్ క్రీమ్, ఆల్ఫాన్సో మ్యాంగో ఐస్ క్రీమ్, కాజు కత్లి, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ కోసం కూడా ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.


More Telugu News