'వారసుడు' సినిమా ఈ ఇద్దరు హీరోలతో కుదరలేదు.. చివరకు విజయ్ వద్దకు వెళ్లింది: దిల్ రాజు
- జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'వారసుడు'
- తొలుత మహేశ్ లేదా రాంచరణ్ లతో చేయాలని ప్లాన్
- ఇద్దరూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో విజయ్ వద్దకు వెళ్లిన సినిమా
ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న వస్తోంది. బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి' జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినవే కావడం గమనార్హం. మరోవైపు తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మించిన 'వారసుడు' సినిమా కూడా జనవరి 12నే విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
ఇదిలావుంచితే, 'వారసుడు' సినిమాకు సంబంధించి దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు హీరోగా తొలుత విజయ్ ను అనుకోలేదని చెప్పారు. మహేశ్ బాబుతో ఈ చిత్రాన్ని చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నారని, అయితే వేరే ప్రాజెక్ట్ తో మహేశ్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత రాంచరణ్ తో అనుకున్నామని, కానీ ఆయన అప్పటికే తన తదుపరి సినిమా డిస్కషన్ లో ఉండటంతో సాధ్యపడలేదని తెలిపారు. దీంతో, చివరకు ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్లిందని అన్నారు.
ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ప్రకాశ్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, జయసుధ, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతాన్ని అందించారు.