గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ దృష్టి.. సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా వర్ల రామయ్యకు సూచన
- సంక్రాంతికి గుడివాడలో క్యాసినో జరిగిందన్న టీడీపీ
- కొడాలి నాని, వంశీ ఆధ్వర్యంలోనే క్యాసినో జరిగిందని ఆరోపణ
- వర్ల రామయ్యకు నోటీసులు పంపిన ఐటీ శాఖ
గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ పోరాటం ఫలించింది. ఈ అంశంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐటీ శాఖ నోటీసులు పంపింది. తన వద్ద ఉన్న సమాచారాన్ని తమకు అందజేయాలని వర్ల రామయ్యకు సూచించింది. నోటీసుల నేపథ్యంలో, వర్ల రామయ్య ఈ నెల 19న విజయవాడలో ఐటీ శాఖ అధికారులను కలవనున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించారని టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్లోనే ఈ క్యాసినో జరిగిందని చెబుతోంది. దీనిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కూడా వేసింది. అంతేకాదు, కొడాలి నాని, వంశీలపై ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోంశాఖలకు కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, గుడివాడ కేసినో వ్యవహారంపై తగిన సమాచారం సేకరించేందుకు ఐటీ శాఖ రంగంలోకి దిగింది.