'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'మసూద' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన 'మసూద'
- థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టిన సినిమా
- ప్రధానమైన బలంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ
- ఈ నెల 21వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
తెలుగు తెరపైకి గతంలో హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే కంటెంట్ ఉన్నవే థియేటర్లలో నిలబడ్డాయి .. వసూళ్లను రాబట్టాయి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా 'మసూద' అని చెప్పుకోవచ్చు. రాహుల్ నిర్మాణంలో .. సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
నవంబర్ 18వ తేదీన థియేటర్లకు వచ్చేంతవరకూ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. థియేటర్లోకి అడుగుపెట్టిన వాళ్లను ఈ సినిమా భయపెట్టకుండా వదల్లేదు. ఈ తరహా సినిమాలలో టేకింగ్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఇంత చిన్న సినిమాకి ఇవన్నీ కలిసొస్తాయా అనే సందేహం, థియేటర్లోకి అడుగుపెట్టిన తరువాత పటాపంచలైపోతుంది.
అలాంటి ఈ సినిమా ఇటీవలే 25 రోజులను పూర్తిచేసుకుంది. సినిమా మొత్తం దెయ్యం కనిపించదు .. ప్రేతాత్మకి సంబంధించిన అన్వేషణ ఉంటుంది. ఎక్కడా కామెడీ ఉండదు .. కానీ అది లేదనే విషయం తెలియదు. దెయ్యంగా మారిన 'మసూద' ముఖం కూడా చూపించకుండా భయపెట్టడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. ఇక ఓటీటీ నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.