భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు!

  • విజయవాడ, శ్రీకాకుళం రోడ్, వరంగల్, బరంపురం నుంచి ప్రత్యేక రైళ్లు
  • నేటి నుంచే అందుబాటులోకి..
  • 20వ తేదీ వరకు ప్రతి రోజూ ప్రత్యేక రైళ్లు
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఇది శుభవార్తే. భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.  నేటి నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం రోడ్-వరంగల్ ప్రత్యేక రైలు (07148) నేటి మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయలుదేరి రేపు ఉదయం ఆరు గంటలకు వరంగల్ చేరుకుంటుంది. అలాగే, వరంగల్-బరంపురం ప్రత్యేక రైలు (07149) రేపు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది.

బరంపురం-విజయవాడ రైలు (07150) 17న మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-బరంపురం మధ్య నడిచే రైలు (07151) 15-20 తేదీల మధ్య ప్రతి రోజు విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఉదయం 11.15కు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (07152 ) బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.


More Telugu News