ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్.. పరిశోధనలో కీలక ముందడుగు!
- ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో తెచ్చేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు
- ఇన్సులిన్ ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను కనుగొన్న ఆస్ట్రేలియా పరిశోధకులు
- ఇన్సులిన్‌ను ప్రేరేపించే పెప్టైడ్ గుర్తింపు
- మరిన్ని పరిశోధనలు అవసరమన్న శాస్త్రవేత్తలు
మధుమేహంతో బాధపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఇకపై రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు పొడుచుకునే బాధ తప్పుతుంది. అతి త్వరలోనే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన విజయవంతమైంది. రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్ తీసుకునే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ పరిశోధనలో వారు గుర్తించారు.
నిజానికి ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నారు. తాజా పరిశోధన ద్వారా ఇందుకు కీలక ముందడుగు పడింది. ఇన్సులిన్ అనేది అస్థిరమని, కాబట్టి దానిని మాత్రల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి కష్టపడుతున్నట్టు డాక్టర్ కిర్క్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (సైరో ఈఎం) సాంకేతికతతో ఇన్సులిన్‌ను ప్రేరేపించే ఒక పెప్టైడ్‌ను గుర్తించినట్టు చెప్పారు. అయితే, దీనిని ఔషధంగా మార్చేందుకు చాలా సమయం పడుతుందని, దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని వివరించారు.