ఈరోజు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 145 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.84 శాతం తగ్గిన టెక్ మహీంద్రా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. మన దేశంతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉదయం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 62,677కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 18,660 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.84%), టాటా స్టీల్ (1.66%), ఎన్టీపీసీ (1.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.34%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), ఏసియన్ పెయింట్స్ (-0.95%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.89%).