ఏసియన్ తారకరామ థియేటర్ ను ప్రారంభించిన బాలకృష్ణ

  • పునర్నిర్మితమైన తారకరామ థియేటర్
  • 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ తో కొత్త హంగులు
  • ఎల్లుండి నుంచి సినిమాల ప్రదర్శన
హైదరాబాబ్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏసియన్ సంస్థ ఈ థియేటర్ ను తీసుకుని మరమ్మతులు చేసింది. తారకరామ థియేటర్ ఇప్పుడు ఏసియన్ తారకరామగా మారింది. ఏసియన్ తారకరామను ఈరోజు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు.

ఈ నెల 16 నుంచి ఇందులో సినిమాల ప్రదర్శన జరగనుంది. చాలా కాలంగా మూతపడి ఉన్న తారకరామ థియేటర్ ను దివంగత ఎన్టీఆర్ స్నేహితుడు, సినీ నిర్మాత నారాయణ్ కే దాస్ నారంగ్ మరమ్మతులు చేపట్టారు. తాజాగా ఆయన కుమారుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. 975 సీటింగ్ కెపాసిటీని 590కి తగ్గించారు. రిక్లైనర్ సీట్లను, సోఫాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి 'అవతార్ 2'ను ప్రదర్శించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి'ని కూడా ఇందులో ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News