ప్రభాస్ కి ఎంతమాత్రం కలిసిరాని 2022
- ఈ ఏడాది మార్చిలో ఫ్లాప్ తెచ్చిన 'రాధేశ్యామ్'
- ప్రభాస్ కెరియర్లో భారీ నష్టాలను చూసిన సినిమా ఇది
- విమర్శల పాలైన 'ఆది పురుష్' టీజర్
- ప్రభాస్ ను కుంగదీసిన కృష్ణంరాజు మరణం
ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒకప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడం కష్టం .. కానీ ఇప్పుడు ఆయనకి కథ చెప్పడం కూడా కష్టమే. అంతగా ఆయన బిజీ అయ్యాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆ సినిమాలు థియేటర్లకు వచ్చే క్షణాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
అలాంటి ప్రభాస్ కి ఈ ఏడాది ఎంత మాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా రూపొందిన 'రాధేశ్యామ్' ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను ఎంతమాత్రం అందుకోలేకపోయింది. వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, నష్టాల బారి నుంచి తప్పించుకోలేకపోయింది.
ఇక ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు అయిన 'ఆది పురుష్' నుంచి ఈ మధ్యనే టీజర్ ను వదిలారు. నాసిరకం గ్రాఫిక్స్ ను ఉపయోగించారంటూ అభిమానుల నుంచి విమర్శల వర్షం కురిసింది. ఈ ప్రభావం సినిమాపై ఏ మేరకు ఉండనుందనే విషయంలో టీమ్ కి అనుమానాలు లేకపోలేదు. ఇక ప్రభాస్ కి పెద్ద దిక్కుగా ఉంటూ ఆయన ఎదుగుదలలో కీలకమైన పాత్రను పోషించిన కృష్ణంరాజు ఇటీవలే మరణించారు. ఇలా రెండు విధాలుగా ప్రభాస్ కి ఈ ఏడాది కలిసిరాలేదనే చెప్పాలి.