బెంగాల్ అలర్ల నిందితుడి కస్టోడియల్ డెత్.. సీబీఐ అధికారులపై హత్య కేసు నమోదు
- ఈ ఏడాది మొదట్లో బీర్భూమ్‌లో హింస
- మహిళ, చిన్నారులు సహా 10 మంది మృతి
- ప్రధాన నిందితుడు లలన్ సింగ్‌ను ఈ నెల 4న ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ
- కస్టడీలో ఉండగా సోమవారం మృతి
- లలన్ పేరును కేసు నుంచి తొలగించేందుకు సీబీఐ అధికారులు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారన్న లలన్ భార్య
- ఎఫ్ఐఆర్‌పై కలకత్తా హైకోర్టుకు సీబీఐ?
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన అల్లర్ల కేసు ప్రధాన నిందితుడు సీబీఐ కస్టడీలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు సంస్థ అధికారులపై కోల్‌కతా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో ఈ ఏడాది మొదట్లో చోటుచేసుకున్న హింస కేసులో లలన్ షేక్ ప్రధాన నిందితుల్లో ఒకడు. సీబీఐ కస్టడీలో ఉన్న లలన్ షేక్ సోమవారం మృతి చెందాడు. దీంతో సీబీఐ సీనియర్ అధికారులపై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. అయితే, ఈ ఎఫ్ఐఆర్‌ను దర్యాప్తు సంస్థ కలకత్తా హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
బీర్భూమ్ హింసలో ఓ మహిళ, చిన్నారులు సహా 10 మంది సజీవ దహనమయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లనన్‌ను ఈ నెల 4న ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు. జిల్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంపులో లలన్‌ను సీబీఐ అధికారులు ఉంచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అతను మృతి చెందాడు.
సీబీఐ అధికారులు చిత్ర హింసలకు గురిచేయడం వల్లే లలన్ మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు నుంచి తన భర్త పేరును తొలగించేందుకు సీబీఐ అధికారులు రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు లలన్ భార్య ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను సీబీఐ తోసిపుచ్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు లలన్ మృతిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కాగా, బొగ్తుయ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టిన గుంపునకు షేక్ నాయకత్వం వహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అంతకుముందు తీవ్రంగా హింసించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.
స్థానిక టీఎంసీ నేత భడుషేక్ మరణం తర్వాత గ్రామంలో ఈ హింస చోటుచేసుకుంది. అయితే, ఈ హత్యకు భూ లావాదేవీలు, అక్రమ వ్యాపారం, దోపిడీ సొమ్ములో వాటా విషయంలో భడుషేక్‌కు ఆయన సహచరులకు మధ్య ఏర్పడిన వైరమే కారణమని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది.