ఈ ఆనందంతో వందేళ్లు బతికేస్తాను బిగ్ బాస్: ఉద్వేగానికి లోనైన ఆదిరెడ్డి
- బిగ్ బాస్ హౌస్ కి కామన్ మేన్ గా వచ్చిన ఆదిరెడ్డి
- ఇన్ని సీజన్స్ లో కామన్ మేన్ ఇన్ని రోజులుండటం ఇదే ఫస్టు టైమ్
- ఆదిరెడ్డికి ఆయన జర్నీని చూపించిన బిగ్ బాస్
- తనని సపోర్టు చేస్తూ వచ్చినవారికి రుణపడి ఉంటానన్న ఆదిరెడ్డి
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఆరుగురు పోటీదారులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ఈ రోజున ఎలిమినేట్ కానున్నారు. మిగతా ఐదుగురు టాప్ ఫైవ్ కి చేరుకుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ .. ఇంటి సభ్యులందరికీ హౌస్ లో వారి జర్నీకి సంబంధించిన హైలైట్స్ చూపిస్తూ, వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. ఇంటి సభ్యులంతా తమ జర్నీలో ముఖ్య ఘట్టాలకి సంబంధించిన ఫొటోలను సేకరించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే నిన్న ఆదిరెడ్డికి వంతు వచ్చింది. హౌస్ లోకి ఆయన కామన్ మేన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ని సీజన్స్ లో కామన్ మేన్ గా వచ్చిన వారెవరూ ఇన్ని రోజుల పాటు హౌస్ లో వున్నది లేదు. అలాంటి ఆదిరెడ్డికి ఆయన జర్నీకి సంబంధించిన స్పెషల్ వీడియోను చూపించారు. ఆయన ఆటతీరును .. మాటతీరును బిగ్ బాస్ అభినందించారు. ఆ సమయంలో ఆదిరెడ్డి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.
"బిగ్ బాస్ .. ఇది నా లైఫ్ లోనే మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. కొన్ని కోట్ల మందిలో ఒకరికి మాత్రమే దక్కే అవకాశం నాకు ఇచ్చారు. అందుకు మీకు థ్యాంక్స్ చెబుతున్నాను. బిగ్ బాస్ లో చివరి నిమిషం వరకూ ఉండాలనేది నా ఆశ .. అది నెరవేరింది. నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చిన జనాలు ఎప్పటికీ నా మనసులో ఉండిపోతారు. ఈ 100 రోజుల ప్రయాణంలో తెలియక నేను ఏదైనా తప్పుచేస్తే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను.
నన్ను సపోర్టు చేస్తూ వచ్చిన వాళ్లందరికీ నేను జీవితం మొత్తం రుణపడి ఉంటాను. బిగ్ బాస్ అనేది నా లైఫ్ ను మార్చింది .. మున్ముందు మరింత మార్చబోతోంది. ఆడియన్స్ నాకు ఏ పొజిషన్ ఇచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను. ఈ సమయంలో నేను పొందుతున్న ఆనందంతో మరో వందేళ్లు బతికేస్తాను బిగ్ బాస్" అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.