హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంస్థ
- ముంబైకి చెందిన ట్రిబేకాతో ట్రంప్ ఆర్గనైజేషన్‌కు పదేళ్ల అనుబంధం
- సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ జూనియర్
- వచ్చే 12 నెలల్లో ప్రాజెక్టుల కోసం రూ. 5 వేల కోట్ల పెట్టుబడి
- మూడు ప్రాజెక్టులు చేపట్టనున్న ట్రంప్ ఆర్గనైజేషన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ ది ట్రంప్ ఆర్గనైజేషన్’ హైదరాబాద్‌లోనూ వాలిపోతోంది. వచ్చే ఏడాది దేశంలోని మూడు నుంచి ఐదు ఉన్నత శ్రేణి నగరాల్లో ముంబైకి చెందిన ట్రిబేకా డెవలపర్స్‌తో కలిసి రూ. 2,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించబోతోంది. ఈ మేరకు ట్రిబేకా డెవలపర్స్ తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఏడు నుంచి 8 ప్రాజెక్టుల కోసం రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు.
ఇందులో రూ. 2,500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ చేపట్టే మూడు నుంచి ఐదు ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ గ్రీన్ ఫీల్డ్‌గా ఉంటాయని వివరించారు. వీటిలో ఒకదానిని హైదరాబాద్‌లో ప్రారంభించనుండగా, బెంగళూరు, చంఢీగఢ్, లుధియానాలలోనూ ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ట్రిబేకా-ట్రంప్ ఆర్గనైజేషన్ మధ్య ఉన్న అనుబంధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పూణెలో నిర్వహించిన వేడుకలకు ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన చేశారు.