సరిహద్దుల్లో పోరుపై ప్రకటన చేసిన చైనా
- భారత్ తో సరిహద్దు వద్ద పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయన్న చైనా
- దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలు కొనసాగుతాయని వెల్లడి
- చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ స్పందన
భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు నిలకడగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. అరుణాచల్ లోని తవాంగ్ వద్ద డిసెంబర్ 9న చైనా సైనికులు భారత్ వాస్తవాధీన ప్రాంతంలోకి చొచ్చుకు రాగా, భారత సైనికులు ప్రతిఘటించారని, ఇరువైపులా సైనికులు గాయపడినట్టు మన దేశం ప్రకటించడం తెలిసిందే. దీనిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో కీలకమైన ప్రకటన కూడా చేశారు. భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా, బలంగా తిప్పికొట్టినట్టు చెప్పారు.
దీంతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందన తెలియజేశారు. ‘‘మాకు తెలిసినంత వరకు చైనా-భారత్ సరిహద్దు పరిస్థితులు మొత్తం మీద స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు అంశంపై దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఎటువంటి అడ్డంకుల్లేని చర్చలు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు. తాజా ఘర్షణలో ఎవరూ మరణించలేదని, పెద్ద గాయాలు కూడా కాలేదని, స్వల్ప గాయాలే అయినట్టు భారత ఆర్మీ మరో వివరణ ప్రకటన కూడా జారీ చేయడం గమనార్హం.