ఐదు నెలలు హాస్టల్లో ఉండి ఇంటికొస్తున్న బాలిక ఏం చేసిందో తెలుసా?
- ఇంటికి వచ్చే సమయానికి తనకు ఏమేమి కావాలో జాబితా పంపిన బాలిక
- ట్విట్టర్ లో షేర్ చేసిన వ్యక్తి
- హాస్టల్ నివాసం అంతగా యాచించేలా చేస్తుందా? అంటూ సందేహం
నేటి తరం పిల్లలు కోరితే చాలు.. తల్లిదండ్రులు నో అనడానికి ఆలోచించాల్సిందే. అధిక ప్రేమ, గారాబం నేటి తరంలో కనిపిస్తాయి. దీంతో వారు తమ తల్లిదండ్రుల వద్ద మరింత గారం పోతుంటారు. ఓ బాలిక విద్య కోసం తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్ లో ఐదు నెలల పాటు ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చే ముందు ఆమె తనకు ఏమేమీ చేసి పెట్టాలో వంటకాల లిస్ట్ ను తల్లిదండ్రులకు పంపించింది.
దీన్ని ఆ బాలిక తండ్రి సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘కుమార్తె ఐదు నెలల తర్వాత 16న సాయంత్రం ఇంటికి వస్తోంది. నిజానికి హాస్టల్ అంతగా యాచించేలా చేస్తుందా!" అంటూ శ్వేతంక్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ మెనూ కొంచెం తినడానికి బలంగానే ఉంది. స్టార్టర్ ప్యాక్ కింద.. చికెన్ సీక్ కబాబ్, ఫిష్ టిక్కా. మెయిన్ కోర్స్ కింద కుకర్ చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ కావాలి. వీటికి సప్లిమెంటరీగా గ్రీన్ చట్నీ, బాగా పలుచగా తరిగిన ఆనియన్, లెమన్.. చివర్లో నోటి తీపికి న్యూటెల్లా చీజ్ కేక్ కావాలన్నది ఆ గారాల కూతురి కోరిక. ‘దయచేసి అంగీకరించండి. చేసి పెట్టండి’ అంటూ చివర్లో చిటెక వేయడం ఆసక్తికరం.
దీనికి నెటిజన్లు కూడా అంతే కామెడిగా స్పందిస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ‘‘నా కూతురికి పెళ్లి కూడా అయింది. ఆమెకు ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమెకంటూ ఓ పెద్ద కిచెన్ కూడా ఉంది. అయినా, తనకు ఏమేమి చేసి పెట్టాలో పెద్ద జాబితాలు పంపిస్తుంటుంది. ఇప్పుడు తన భర్త, తన కుమారుడికి ఏమేమి కావాలో కూడా తన జాబితాకు జోడిస్తోంది’’ అని కామెంట్ పెట్టడం చర్చను మరింత రుచికరంగా మార్చేసింది.