క్షణక్షణం భయాన్ని రేకెత్తిస్తున్న 'బటర్ ఫ్లై' .. ట్రైలర్ రిలీజ్!

  • అనుపమ తాజా చిత్రంగా 'బటర్ ఫ్లై'
  • సైకో థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • ముఖ్యమైన పాత్రల్లో రావు రమేశ్, భూమిక 
  • ఈ నెల 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
యూత్ లో అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజ్ ఉంది. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ ఆమె ముందుకు వెళుతోంది. ఆమె ప్రధాన పాత్రధారిగా 'బటర్ ఫ్లై' సినిమా రూపొందింది. రవి ప్రకాశ్ - ప్రసాద్ - ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి, ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  కానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నగరంలో ఒక సైకో వరుసగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి .. ఆ తరువాత చంపేస్తుంటాడు. అతను పెట్టుకున్న ఈ ఆపరేషన్ పేరే 'బట్టర్ ఫ్లై'. ఒక అపార్టుమెంటులోని ఫ్లాట్ లో నాయిక తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఓ రోజున నాయిక ఇద్దరు పిల్లలను ఒక సైకో కిడ్నాప్ చేస్తాడు.

 అతని బారి నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతగా తాపత్రయ పడిందనేదే కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. రావు రమేశ్ .. భూమిక ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.


More Telugu News