వోడ్కా వ్యాపారంలోకి ఆర్యన్ ఖాన్!

  • సన్నిహితులతో కలసి శ్లాబ్ వెంచర్స్ ఏర్పాటు
  • ఇన్ బెవ్ తో ఒప్పందం
  • సంపన్న వర్గాల వారే లక్ష్యం
  • తండ్రికి భిన్న మార్గంలో ప్రయాణం
బాలీవుడ్ బడా స్టార్టలలో ఒకరైన షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (25) తన తండ్రి మాదిరిగా నటుడిగా కాకుండా, డైరెక్టర్ గా జర్నీని మొదలు పెట్టబోతున్నాడు. గత వారమే తాను డైరెక్టర్ కాబోతున్నట్టు ఆర్యన్ ఖాన్ ప్రకటించగా.. మరోవైపు అతడు తన స్నేహితులు, భాగస్వాములతో కలసి వోడ్కా వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రీమియం వోడ్కా బ్రాండ్ ను దేశంలోని మద్యం బాబులకు పరిచయం చేయనున్నాడు. 

ఈ వ్యాపారం కోసం ఆర్యన్ ఖాన్, అతడి సన్నిహితులు ఓ బెవరేజెస్ కంపెనీతో టైఅప్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తండ్రికి మాదిరిగా ఆర్యన్ కు నటన పట్ల అభిరుచి లేదు. అందుకే అతడు వ్యాపారవేత్త అవతారంలో కనిపించనున్నాడు. ఆర్యన్ తన భాగస్వాములైన బంటీ సింగ్, లేటి బ్లోగవా కలసి ప్రీమియం వోడ్కా బ్రాండ్ ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్టు మింట్ పత్రిక ప్రచురించింది. 

‘శ్లాబ్ వెంచర్స్‘ అనే పేరుతో ఓ కంపెనీని సైతం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రివరేజీ కంపెనీ అయిన ఏబీ ఇన్ బెవ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. శ్లాబ్ వెంచర్స్ ఉత్పత్తులను ఇన్ బెవ్ మార్కెటింగ్ చేస్తుంది. మార్కెట్లో శూన్యత ఆవరించి ఉండడం అదనపు ఆవిష్కరణలకు అనుకూలంగా ఆర్యన్ ఖాన్ చెప్పాడు. దేశంలో సంపన్న మద్యం బాబులను ఆర్యన్ ఖాన్ కంపెనీ లక్ష్యం చేసుకోనుంది.


More Telugu News