25 రోజులను పూర్తిచేసుకున్న 'మసూద'
- నవంబర్ 18న విడుదలైన 'మసూద'
- నిన్నటితో 25 రోజులు పూర్తి
- ప్రధానమైన పాత్ర ముఖం చూపించని ప్రయోగం
- ఉత్కంఠను రేకెత్తించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాల్లో 'మసూద' ముందువరుసలో కనిపిస్తుంది. రాహుల్ నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. బాంధవి .. సంగీత .. తిరువీర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు, ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది.
నవంబర్ 18వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నిన్నటితో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకుంది. పెద్దగా పబ్లిసిటీ లేని ఈ సినిమా, మౌత్ టాక్ తోనే థియేటర్లలో నిలబడింది. వసూళ్ల పరంగా మేకర్స్ కి లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. నవంబర్ 18 తరువాత చాలా సినిమాలే వచ్చినప్పటికీ, ఈ సినిమా థియేటర్లలో ఉండటం విశేషమే. ఈ సినిమాలో 'మసూద' అనే ప్రధానమైన పాత్ర ముఖం చూపించకుండా సినిమా మొత్తాన్ని నడిపించడమే ప్రత్యేకతగా అనిపిస్తుంది.