ఒక్క ఇన్నింగ్స్ తో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి వెళ్తున్న ఇషాన్ కిషన్

  • బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్
  • 2023-24కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు దక్కే అవకాశం
  • ఒక్క ఇన్నింగ్స్ తో జట్టు సమీకరణాలను మార్చేసిన యువ కెరటం
టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ ఆడిన ఒక మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా సమీకరణాలన్నింటినీ మార్చేస్తోంది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో అంతర్జాతీయ కెరీర్ లో తన తొలి సెంచరీనే ఇషాన్ డబుల్ సెంచరీగా మలిచాడు. ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ కు భారత అభిమానులే కాకుండా, స్టేడియంలోని బంగ్లా ఫ్యాన్స్ సైతం అచ్చెరువొందారు. 

ఈ నేపథ్యంలో టీమిండియాలో కూడా ఇషాన్ ప్రమోషన్ పొందబోతున్నాడు. 2023-24కు సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును ఇషాంత్ దక్కించుకోనున్నాడు. ఈ నెల 21న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు. ఇంతవరకు ఇషాంత్ కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. ఇప్పుడు అతడికి బీ లేదా సీ కాంట్రాక్టును ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సీ గ్రేడ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యాలకు కూడా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.


More Telugu News