ఎన్నికలంటే అందాల పోటీ కాదు: జైరాం రమేశ్
- రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర సానుకూల ఫలితాలు ఇచ్చిందన్న జైరాం రమేశ్
- ఎన్నికల్లో వచ్చే తీర్పు, ఫలితం ఏ ఒక్క వ్యక్తికో చెందకూడదన్న కాంగ్రెస్ నేత
- అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఉన్నవి భేదాభిప్రాయాలు మాత్రమేనని స్పష్టీకరణ
ఎన్నికల్లో గెలవడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని, వ్యవస్థలో ఎన్నికలు అనేవి ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. రాజస్థాన్‌కు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓ మహిళను కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.
ఒకటి, రెండుసార్లు మినహా కాంగ్రెస్ ఎప్పుడూ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోల మీద, గుర్తుల మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు. ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తెలుస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో వచ్చే తీర్పు, ఫలితం పార్టీకే చెందాలి కానీ ఏ ఒక్క వ్యక్తికో కాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ.. ఇది సానుకూల ఫలితాలు ఇచ్చిందని అన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఎలాంటి రాజకీయ పోరు లేదని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. వారిద్దరూ పార్టీకి ఎంతో విలువైన వ్యక్తులని, వారి మధ్య ఉన్నవి అభిప్రాయ భేదాలు మాత్రమేనని జైరాం రమేశ్ పేర్కొన్నారు.