ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్'
- రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
- రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం
- అంతర్జాతీయంగా విశేష గుర్తింపు
- వివిధ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనలు
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది. నాన్ ఇంగ్లీష్ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు ఈ నామినేషన్ లభించింది. ఈ మేరకు ది హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ పీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా, నాన్ ఇంగ్లీష్ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు కొరియన్ రొమాంటిక్ మిస్టరీ చిత్రం 'డెసిషన్ టు లీవ్', జర్మనీ యాంటీ వార్ డ్రామా చిత్రం 'ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్', అర్జెంటీనా హిస్టారికల్ డ్రామా చిత్రం 'అర్జెంటీనా 1985', ఫ్రెంచ్-డచ్ భాగస్వామ్యంలో వచ్చిన కుర్రకారు డ్రామా 'క్లోజ్' చిత్రం నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఆర్ఆర్ఆర్... పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అటు, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలోనూ 'నాటు నాటు' పాటకు గాను ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయింది. ఎంఎం కీరవాణి సంగీతంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ గీతాలు సూపర్ హిట్టయ్యాయి.