భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ రాజుకున్న ఘర్షణలు... సైనికులకు గాయాలు

  • ఈ నెల 9న ఘటన
  • వాస్తవాధీన రేఖ దాటేందుకు చైనా దళాల యత్నం
  • సమర్థంగా అడ్డుకున్న భారత బలగాలు
  • అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లో ఘటన
రెండేళ్ల కిందట గల్వాన్ లోయలో చైనా బలగాల దురాక్రమణను భారత బలగాలు అడ్డుకునే క్రమంలో జరిగిన ఘర్షణ దేశ చరిత్రలో విషాదకర ఉదంతంగా మిగిలిపోతుంది. ఈ ఘర్షణల్లో నాడు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా వైపున కూడా 45 మంది వరకు సైనికులు హతులైనట్టు వార్తలొచ్చాయి. 

కాగా, భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవాధీన రేఖ దాటేందుకు చైనా దళాలు యత్నించగా, భారత సైనికులు సమర్థంగా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణలు రాజుకున్నాయి. ఈ ఘటనలో భారత్, చైనా సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చోటుచేసుకుంది. 

దీనిపై భారత్, చైనా రక్షణ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఇరుదేశాల కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశాయి. సరిహద్దుల్లో శాంతి, సామరస్య పునరుద్ధరణకు చర్యలు చేపట్టాయి.


More Telugu News