సాయిపల్లవి మాట ఎక్కడా వినిపించదేం?
- వివిధ భాషల్లో సాయిపల్లవికి స్టార్ డమ్
- కొత్త ప్రాజెక్టులలో కనిపించని ఆమె పేరు
- ఇతర భాషల్లోనూ ఇదే పరిస్థితి
- కారణం తెలియని అయోమయంలో ఫ్యాన్స్
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'ఫిదా' పోస్టర్లపై సాయిపల్లవిని చూసిన వాళ్లంతా, అందం విషయంలో అంతంత మాత్రం అనుకున్నారు. థియేటర్ లోకి వెళ్లిన తరువాత మాత్రం ఆమె అభిమానులుగానే తిరిగొచ్చారు. అంతగా తన అభినయంతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది.
సాయిపల్లవి ఒక కథను ఒప్పుకుందంటే కంటెంట్ లో కొత్తదనం ఏదో ఉందనే నమ్మకం ఆడియన్స్ కి కలిగింది. ఆమె నటనతో పాటు డాన్స్ కూడా వాళ్లను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక వ్యక్తిత్వం పరంగా కూడా ఆమె తెలుగువారిని ఆకట్టుకుంది. సాయిపల్లవి ఉంటే చాలు .. ఆ సినిమా చూడొచ్చునని ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా ఆమె నమ్మకాన్ని సంపాదించుకోగలిగింది.
అలాంటి సాయిపల్లవి పేరు 'శ్యామ్ సింగ రాయ్' తరువాత ఏ ప్రాజెక్టులోను వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఆ తరువాతనే 'విరాటపర్వం' వచ్చినా, రిలీజ్ విషయంలో లేట్ కారణంగా, తెలుగులో ఆమె చివరి సినిమాగా అది కనిపిస్తోంది. సాయిపల్లవికి తగిన కథలు రావడం లేదా? లేదంటే తెలుగు సినిమాలు చేసేంత తీరిక ఆమెకి లేదా? కొత్త ఏడాదిలోనైనా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేనా? అనే ప్రశ్నలే ఇక్కడ అందరినీ వేధిస్తున్నాయి.