పూరి సినిమా కోసం 16 కేజీలు తగ్గితే ఆయనే గుర్తుపట్టలేదు: సత్యదేవ్
- 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో సత్యదేవ్
- సినిమాల కోసం జాబ్ మానేశానని వెల్లడి
- 'జ్యోతిలక్ష్మి' తరువాత కెరియర్ మారిందని వ్యాఖ్య
- పూరి సార్ ను మరిచిపోలేనని స్పష్టీకరణ
హీరో సత్యదేవ్ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్నాడు. తన కెరియర్ గురించి ఆయన మాట్లాడుతూ .. "సినిమాల పట్ల ఆసక్తితో జాబ్ మానేశాను. చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళ్లాను. అలాంటి పరిస్థితుల్లోనే పూరి గారి 'జ్యోతి లక్ష్మి' సినిమా ఆడిషన్స్ కి వెళ్లాను. పూరిగారి సినిమాల్లో చేయడానికి హీరోలంతా రెడీగా ఉంటారు. కనుక విలన్ రోల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని భావించాను" అన్నాడు.
పూరిగారికి నేను ఇచ్చిన ఆడిషన్ నచ్చింది. అప్పటికి నేను 90 కేజీలు ఉండేవాడిని. అందువలన బరువు తగ్గవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో విలన్ కాస్త హ్యాండ్సమ్ గా ఉంటాడేమో అనుకుని బరువు తగ్గడం పైనే దృష్టి పెట్టాను. అలా 16 కేజీల వరకూ బరువు తగ్గాను. ఆ తరువాత వెళ్లి ఆయనకి కనిపిస్తే వెంటనే గుర్తుపట్టలేదు. ఆ తరువాత 'ఇదేంటి పేషంట్ మాదిరిగా తయారవ్వు?' అన్నారు.
అప్పుడు చెప్పారు ఆయన ఈ సినిమాలో నేనే హీరో అని. అందువలన కొంచెం బరువు పెరగమని అన్నారు. అలా పూరి గారి దగ్గరికి విలన్ వేషాల కోసం వెళ్లిన నేను హీరోను అయ్యాను. 'టెంపర్' వంటి హిట్ తరువాత ఆయన 'జ్యోతిలక్ష్మి' చేయడం .. అందులో హీరో కావడం నాకు కలిసొచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. నాకు ఇలాంటి ఒక ఫ్లాట్ ఫామ్ ను ఇచ్చిన పూరీగారిని ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చాడు.