'కాంతారా' సినిమాపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

  • రూ. 15 కోట్లతో నిర్మితమై రూ. 350 కోట్లను రాబట్టిన 'కాంతారా'
  • భారీ బడ్జెట్ ఉండాలనుకునే తనలాంటి వాళ్లను ఇరుకున పెట్టిందన్న రాజమౌళి
  • తనను తాను ప్రశ్నించుకునేలా చేసిందని వ్యాఖ్య
కన్నడ సినిమా 'కాంతారా' బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాలు సైతం చిన్నబోయేలా ఈ చిన్న సినిమా వసూళ్లను రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూ. 350 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. ఇలాంటి అద్భుతం భారత సినీ పరిశ్రమ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తన నటనకు, దర్శకత్వ ప్రతిభకు రిషభ్ శెట్టి అందరి ప్రశంసలను అందుకున్నాడు. 

మరోవైపు, ఈ చిత్రం గురించి దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్, చిత్రీకరణ భారీగా ఉండాలనుకునే తనలాంటి వాళ్లను 'కాంతారా' ఇరుకున పెట్టిందని అన్నారు. తనను తాను సమీక్షించుకునేలా, ప్రశ్నించుకునేలా చేసిందని అన్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించలేనంతగా వసూళ్లను సాధించడం అద్భుతమని కితాబునిచ్చారు. ఇకపై తనలాంటి వాళ్లు సినిమాను ప్రారంభించే ముందు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలని ఈ చిత్రం సూచించిందని అన్నారు.


More Telugu News