జపాన్ బాక్సాఫీసు వసూళ్లలో ముత్తును దాటేసిన ఆర్ఆర్ఆర్

  • 400 మిలియన్ యెన్ లతో ముత్తు పేరిట రికార్డు
  • ఇప్పటికే 400 మిలియన్ యెన్ లకు పైగా ఆదాయం
  • ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు చేరిన వసూళ్లు
భారీ బడ్జెట్ తో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లోనూ రికార్డులు రాస్తోంది. బాక్సాఫీసు వసూళ్లలో ముత్తు సినిమాను వెనక్కి నెట్టింది. అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ జపాన్ లో విడుదలైంది. జపాన్ చరిత్రలో అత్యధిక వసూళ్లను నమోదు చేసిన భారత్ సినిమాగా గుర్తింపు పొందింది. 

జపాన్ లో అత్యధిక  ఆదాయాన్ని వసూలు చేసుకున్న భారత చిత్రంగా రెండు దశాబ్దాలుగా ముత్తు పేరిట ఉన్న రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టింది. జపాన్ వ్యాప్తంగా 44 పట్టణాల్లో 200కు పైగా స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ విడుదలైంది. 400 మిలియన్ల జపాన్ యెన్ ల ( రూ.24 కోట్లు) ఆదాయాన్ని అధిగమించింది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు సినిమా అందుకున్న ఆదాయం 400 మిలియన్ జపాన్ యెన్ లు. 

జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలు నిర్వహించగా, వీటి కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఇతర సినిమా బృందం వెళ్లడం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1,100 కోట్లను వసూలు చేసుకుంది.


More Telugu News