నా నుదుటిపై గాయానికీ .. చిరూ సినిమాకి సంబంధం ఉంది: సత్యదేవ్
- విలక్షణ నటుడిగా సత్యదేవ్ కి పేరు
- 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో తన కెరియర్ గురించిన ముచ్చట్లు
- చిరంజీవి అంటే పిచ్చి అని వెల్లడి
- 'కొదమ సింహం' గురించిన ప్రస్తావన
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, హీరోగా ఎదిగినవారిలో సత్యదేవ్ ఒకరిగా కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గుర్తుందా శీతాకాలం' ప్రస్తుతం థియేటర్లలో ఉంది. 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన కెరియర్ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.
"మొదటి నుంచి కూడా నాకు నటనపై ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది. అందువలన ఎప్పుడూ ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్లడం .. నాకు సంబంధించిన ఫోటోలు .. వీడియోలు పంపించడం చేసేవాడిని. చిన్నప్పుడు నా నుదుటిపై ఒక గాయమైంది. దాని తాలూకు మచ్చ వలన కొన్ని అవకాశాలు పోయాయి. 'జ్యోతిలక్ష్మి' సినిమా సమయంలోను ఈ మచ్చ విషయంలో కొత్త చర్చ నడిచింది. నా నుదుటిపై మచ్చను నోటీస్ చేయని విధంగా నటించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను" అన్నాడు.
"ఇక అసలు నా నుదుటిపై గాయం ఎందుకైందంటే, చిన్నప్పుడు నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి. 'కొదమసింహం' సినిమాలో ఆయన ఒక కొండపై నుంచి మరో కొండపైకి ఊగుతూ వెళతారు. అది చూసి మా ఇంట్లోని ఒక కేబుల్ తో అలాగే ట్రై చేశాను. ఆ కేబుల్ తెగిపోవడం ... నేను కిందపడిపోవడం జరిగిపోయింది .. అలా ఈ గాయమైంది. 'చంద్రుడికి మచ్చ ఉన్నట్టే .. నీకూ ఒక మచ్చ ఉందిరా' అని మా అమ్మ అంటూ ఉండేది" అంటూ చెప్పుకొచ్చాడు.