నేను ఆంబోతునా... మరి నువ్వేంటి?: చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్
- పొన్నూరులో చంద్రబాబు వ్యాఖ్యలు
- చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నాడన్న అంబటి
- సబ్జెక్టు లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాడని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గంట, అరగంట రాంబాబు అంటున్నారని, నిన్న పొన్నూరులో ఆంబోతు రాంబాబు అన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంత దిగజారి మాట్లాడడం సరికాదని అన్నారు.
"నీ దగ్గర పనిచేసే చెంచాగాళ్లో, నీ మోచేతి నీళ్లు తాగేవాళ్లో ఈ మాటలు అంటే ఫర్వాలేదు... 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసినవాడివి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలికుడినని చెప్పుకుంటున్నవాడివి, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్న వాడివి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రధాని పదవినే వద్దనుకున్నానని చెప్పుకున్న నువ్వు నన్ను ఇంత చీప్ గా మాట్లాడతావేంటయ్యా చంద్రబాబూ!
నీ దగ్గర సబ్జెక్టు లేదు, సమాధానం లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు. గంట అంటావు, అరగంట అంటావు... నేను ఆంబోతునా? మరి నువ్వేం చేశావు... నీ రాజకీయ జీవితం ఏంటి? ఆంబోతులకు ఆవులను సప్లై చేసి సీటు పొందిన వ్యక్తివి కాదా నువ్వు? అధికారం పొందడం కోసం నువ్వు చేసిన అకృత్యాలు, అన్యాయాలు ఎవరికి తెలీదు?
ఆంబోతులకు ఆవులను సప్లై చేసే స..వి... నువ్వా నా గురించి మాట్లాడేది? అలా సప్లై చేసే వారిని తెలుగులో ఏమంటారో ఓసారి తెలుసుకో! నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. స్థాయి తక్కువ మాటలు మాట్లాడొద్దు... నోరు జారొద్దు. నువ్వు నోరు జారావంటే మేం కూడా నోరు జారాల్సి ఉంటుంది... జాగ్రత్త చంద్రబాబూ!
అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే ధైర్యం ఉంటే మాట్లాడు... లేకపోతే నీ పని నువ్వు చేసుకో. ఇదేం ఖర్మ అని నువ్వు ఎంత ప్రచారం చేసినా మాకేం కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. అందుకు కారణం సీఎం జగన్ సుపరిపాలన" అంటూ అంబటి రాంబాబు స్పందించారు.