భారీ టార్గెట్ తో బంగ్లాదేశ్ బెంబేలు... మూడో వన్డేలో గెలుపు దిశగా టీమిండియా

  • ఛట్టో గ్రామ్ లో మూడో వన్డే
  • మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు
  • బంగ్లాదేశ్ టార్గెట్ 410 రన్స్
  • 124 పరుగులకే 5 వికెట్లు డౌన్
బంగ్లాదేశ్ లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ తడబాటుకు గురైంది. బంగ్లాదేశ్ జట్టు 124 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ 2, సిరాజ్ 1, ఉమ్రాన్ మాలిక్ 1, కుల్దీప్ 1 వికెట్ తీశారు. షకీబల్ హసన్ 43, కెప్టెన్ లిట్టన్ దాస్ 29, యాసిర్ 25 పరుగులు చేశారు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ 26 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మహ్మదుల్లా 20, అఫిఫ్ హుస్సేన్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఆ జట్టు గెలవాలంటే 24 ఓవర్లలో 268 పరుగులు చేయాలి.


More Telugu News