చంద్రబాబు బరి తెగించి మాట్లాడుతున్నారు: ఏపీ బీజేపీ ఫైర్
- గుజరాత్ లో బీజేపీ ఏడు పర్యాయాలు విజయభేరి
- ఆ విజయాలను చూసి ఏపీ పార్టీలు నేర్చుకోవాలంటూ బీజేపీ ట్వీట్
- సీఎం జగన్, చంద్రబాబుపై బీజేపీ విమర్శల దాడి
ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అభివృద్ధి అజెండాతో గుజరాత్ లో బీజేపీ ఏడు పర్యాయాలు గెలిచిన ఫలితాలను చూసి ఏపీలో ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలని హితవు పలికింది.
రాష్ట్రంలో 2024లో పంచడానికి ఏముంది... హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప? అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వస్తే మైనారిటీలకు పాత సంక్షేమ పథకాలను వడ్డీతో సహా ఇస్తామని చంద్రబాబు మరీ బరితెగించి చెబుతున్నారని మండిపడింది. చంద్రబాబు మాటలు టీడీపీ దివాలా కోరు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొంది.
అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారి మళ్లించి సీఎం జగన్ రాష్ట్రాన్ని 90 శాతం నాశనం చేస్తే, తాను 100 శాతం నాశనం చేస్తానని మాజీ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని దుయ్యబట్టింది. 2024లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది.